నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల దారి లేక పోవడంతో నవ తెలంగాణ పత్రికలో ” కళాశాలకు వెళ్లేదేలా? ” అని వార్త సోమవారం నవతెలంగాణ తెలుగు దినపత్రికలు ప్రచురితమైంది. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలాం మంగళవారం నాడు స్థానిక పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ రెడ్డి తో కలిసి కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ నిధులు జుక్కల్ ప్రభుత్వ కళాశాలకు 21 లక్షలు మంజూరైన తెలిపారు. కళాశాలకు దారి లేకపోవడంతో బురద మరియు వర్షపు నీటి నుండి విద్యార్థులు నడిచి వెళ్లే క్రమంలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలుసుకున్న అధికారి వెంటనే గ్రావిల్ రోడ్డు నిర్మాణం చేయాలని పి ఆర్ ఏఈ శ్రీకాంత్ రెడ్డిని ఆదేశించారు.
పటిష్టమైన రోడ్డు నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అనంతరం వెనువెంటనే సీసీ రోడ్డు కూడా వేసి విద్యార్థిని , విద్యార్థులకు అధ్యాపకులకు, కళాశాలకు వచ్చే అధికారులకు సుగుమం చేయాలని సూచించారు. కళాశాలకు దారిని బుధవారం నుండి పనులు ప్రారంభిస్తామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలాం, పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డికి సిబ్బందికి తెలియచేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియచేశారు.
నవతెలంగాణ కథనానికి స్పందన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES