Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. మంగళవారం ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్,మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం ఇవ్వకపోవడంతో సంబంధిత ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు విద్యార్థులకు అందించే భోజనం మెనూ ప్రకారం ఉందా లేదా అన్నది స్కూల్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య, పదవ తరగతి విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి నుంచే పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలనీ, ప్రతి సబ్జెక్ట్‌లో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -