సిఐటియు డిమాండ్
నవతెలంగాణ – పరకాల
రాష్ట్రవ్యాప్తంగా హమాలీ కార్మికులు చేస్తున్న ఎగుమతి దిగుమతుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సేస్ ల రూపంలో కోట్ల రూపాయలు వస్తున్న వీరి సంక్షేమం కోసం ప్రభుత్వం నయా పైసా ఖర్చు చేయడం లేదు అందుకే హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వీరిని ఆదుకోవాలని సిఐటీయు జిల్లా అధ్యక్షులు టి. ఉప్పలయ్య ఆల్ అమాలి వర్కర్స్ యూనియన్ కార్యదర్శి బొట్ల చక్రపాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హమాలీ కార్మికుల మండల మహాసభ బొచ్చు ఆదం అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. జిల్లాలో ఉన్న సిమెంట్, ఐరన్, ఇతర షాపులలో హమాలీ కార్మికులుగా పనిచేస్తు,ఎలాంటి హక్కులు లేకుండా, రోజుకు 10 నుండి 12 గం॥లు పనిచేస్తున్నారు హమాలీలు నిత్యం బరువులు మోయడం వలన శరీరం బండబారిపోతుందాని నడుములు వంగిపోయి, నరాలు సచ్చుబడి పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము, దూలి, గాలి, వెలుతురు లేకుండా పని చేయడం ఫలితంగా ఊపిరితిత్తుల జబ్బుల భారీన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వీరు పనిచేసి క్రమంలో ప్రమాదాలు జరిగి అనేక మంది గాయాలపాలై కాళ్లు, చేతులు విరిగి మంచాలకు పరిమితమైన హమాలీల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వీరు చేసే పనిద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. కాని వీరి సంక్షేమాన్ని మాత్రం పాలకులు విస్మరిస్తున్నాని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా పాలకులు వీరి కోసం భవన నిర్మాణ కార్మికుల తరహా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వీరి సంక్షేమం కోసం పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీరికి పని భద్రత, గుర్తింపులు ఈఎస్ఐ,పిఎఫ్ ప్రమాదబీమా,ఆరోగ్య భీమ, సౌకర్యాలు కల్పించాలని వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహాయం చేయాలని,వయసు పైబడ్డ తరువాత హమాలీ పని చేయలేకపోతున్నారని ,దీంతో వారి కుటుంబాలు గడిచే పరిస్థితి లేదు.
కావున ప్రభుత్వం వీరికి పెన్షన్ 50 సం॥లు పైబడిన హమలీ కార్మికులకు రూ.10వేల పెన్షన్ ప్రతినెల ఇవ్వాలని హమాలీ కార్మికులు మరణిస్తే 10 లక్షల ఎక్స్ గ్రేషియో ఇచ్చి, వారి కుటుంబాన్ని అదుకోవాలని ,పని ప్రదేశాలలో మంచినీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలతో కూడిన ఆఫీసు నిర్మాణం చేయాలి. ప్రభుత్వ పధకాలల్లో హమాలీలకు మొదటి ప్రాధాన్యత నిచ్చి హమాలి కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యెడల సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు పెండ్యాల కమల్ సదానందం రమేష్ రాజమౌళి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES