Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేకను కాపాడబోయి కాపాలదారుడు మృతి

మేకను కాపాడబోయి కాపాలదారుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
రైల్ పట్టాలపై మేస్తున్న మేకను కపాడబోయి వ్యక్తి ప్రాణాలను కోల్పోయిన సంఘటన మండలంలోని ఒడ్యాట్ పల్లి గ్రామంలోని రైల్వే ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం ఒడ్యాట్ పల్లి గ్రామానికి చెందిన పుల్లింటి సాయిలు (54) సోమవారం తన మేకలనును పెపడానికి వెళ్ళాడు. గ్రామ శివారులో పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే పట్టాలు ఉన్నాయి.  రైల్ వస్తున్న సమయంలో పట్టాల మధ్యలో మేక మేస్తుందటం చూసి దానిని దూరంగా కొట్టడానికి వెళ్ళాడు. అదే సమయంలో రైల్ వచ్చి సాయిలు ను డి కొట్టింది. అతనికి రెండు కాళ్ళు విరిగాయని, జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందడాన్నారు. మృతునికి భార్య సావిత్రి, కుమారుడు ఉన్నారన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -