నవతెలంగాణ – చారకొండ
మండలంలోని జూపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న తరగతి గదులను, పాఠశాల పరిసరాలు, వంట గదులను తనిఖీ చేశారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం ను కూడా పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించి.. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేలా ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అలాగే తరగతి గదిలో విద్యార్థులకు గణిత సబ్జెక్టులపై బోధన చేసి విద్యార్థులకు గణితంలో మేలుకోలను నేర్పించారు. గణితంపై ఆసక్తిని పెంచేలా ఉపాధ్యాయులు ప్రయోగాత్మకంగా బోధనా పద్ధతులు చేపట్టాలని సూచించారు. డీఈవో తోపాటు జిల్లా టెస్ట్ బుక్ మేనేజర్ నరసింహులు ఉన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి: డీఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES