Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

బస్వాపూర్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యం లో వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా మంగళవారం ఘనంగా జరపడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని వాల్మీకి మహర్షి జెండాను ఎగురవేసి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. వాల్మీకి మహర్షి గురించి ప్రజలకు గ్రామ పెద్దలు వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని సూచించారు. అదేవిధంగా గ్రామస్తులకు మహా అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ మాజీ సర్పంచ్, రవిశంకర్ పటేల్, సురేష్ గొండ, రిటైర్డ్ టీచర్, గంగారెడ్డి, సంగారెడ్డి, రామ్ రెడ్డి, ముదిరాజ్ కుల సంఘ నాయకులు, తాటి మారుతి, హనుమంత్, బస్వంత్, బాలు,కంగటే, మారుతి, దొడికింది రామ్ గొండ, కమ్మరి నర్సింగ్ మహారాజ్, సాయిలు, సురేష్, ముదిరాజ్ కుల సంఘం మహిళలు గ్రామ చిన్న పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -