Wednesday, October 8, 2025
E-PAPER
Homeక్రైమ్ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయగిరి మల్లన్న గుడి సమీపంలోని వేపచెట్టుకు ఉరి వేసుకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రాగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో మంగళవారం  చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ప్రాథమిక సమాచారం ప్రకారం, కొమరయ్య  గత రెండు సంవత్సరాలుగా మానసిక స్థితి సరిగా లేక ఇంటి నుండి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భువనగిరి రూరల్ పోలీసులు ఫోన్ ద్వారా ఫోటోలు పంపగా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్ ఎస్సై ఎం అనిల్ కుమార్  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -