Wednesday, October 8, 2025
E-PAPER
Homeసినిమాఓ అమ్మాయికి అవమానం జరిగితే?

ఓ అమ్మాయికి అవమానం జరిగితే?

- Advertisement -

వరుణ్‌ సందేశ్‌, మధులిక వారణాసి జంటగా రూపొందిన చిత్రం ‘కానిస్టేబుల్‌’. జాగతి మూవీ మేకర్స్‌ పతాకంపై ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రసాద్‌ ల్యాబ్‌లో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ, ‘సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని తీశాం. కమర్షియల్‌, ఎంటర్టైన్మెంట్‌, సందేశం వంటి అంశాలు మిళతమై ఉంటాయి’ అని అన్నారు. ‘ఈ చిత్రానికి సెన్సార్‌ యు/ఎ సర్టిఫికెట్‌ లభించింది. ఈ నెల 10న భారీగా విడుదల చేయబోతున్నాం.

ఒక అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని చూపించాం. అమ్మాయిలతో పాటు తల్లి తండ్రులు కూడా ఈ సినిమాను చూడాలి’ అని నిర్మాత బలగం జగదీశ్‌ అన్నారు. దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. మాట్లాడుతూ, ‘ట్రైలర్‌, పాటలకు వచ్చిన స్పందన సినిమా పట్ల మా నమ్మకాన్ని పెంచింది. నిర్మాత కథను నమ్మి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఈ సినిమా తెరపైకి ఇంత అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు. ఈ వేడుకలో యువ హీరోలు అర్జున్‌, కార్తీక్‌ రాజు, విశ్వ కార్తికేయ, సునామీ సుధాకర్‌, దువ్వాసి మోహన్‌, కెమెరామెన్‌ హజరత్‌, సంగీత దర్శకుడు సుభాష్‌ ఆనంద్‌, సహ నిర్మాతలు నికిత జగదీష్‌, కుపేంద్ర పవర్‌తోపాటు ఇతర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -