నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీక రణను అమలు చేస్తున్నట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఎస్సీ అభ్యర్థులు పాత కులం సర్టిఫికెట్ల స్థానంలో కొత్త ఫార్మాట్‌లో కులం సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. తహసీల్దార్, మీసేవా కార్యాలయాల్లో నూతన ఫార్మెట్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఫార్మెట్లలో ఎస్సీల్లో కులాన్ని బట్టి గ్రూప్-1,2,3 కేటగిరీలుగా విభజించారు. వెరిఫికేషన్ సమయంలో ఈ కొత్త సర్టిఫికెట్లను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
ఆర్టీసీ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES