కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌తో
చిన్న, సన్నకారు రైతుల అనుసంధానం : జర్మనీ
పరిశోధనా సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి, ఈ రంగాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికత ను చిన్న, సన్నకారు రైతులకు ఎలా అనుసంధానం చేయాలనే అంశంపై మంగళవారం హైదరాబాద్ లోని బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో జర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ ‘ఫ్రాన్‌హౌఫర్ హెచ్‌హెచ్‌ఐ’ ప్రతినిధుల బృందంతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వ్యవసాయ సాగు పద్ధతులు, అనుసరిస్తున్న విధానాలను మంత్రి వారికి వివరించారు. ”రాష్ట్ర జనాభాలో 55 శాతం మందికి వ్యవసాయం జీవనోపాధి కల్పిస్తోంది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరుగుద లకు తన చేయూత ను అందిస్తోంది. అయితే రోజురోజుకూ వ్యవసా యంలో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. సాగులో పురుగు మందుల వినియోగం పెరిగి పర్యావర ణానికి ఎంతో హానీ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో పెట్టుబడి వ్యయం, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాల జీస్‌ను వ్యవసాయానికి అనుసంధానించాల్సిన అవ సరం ఉంది. అందుకు అనుగుణంగానే మా ప్రభు త్వం పకడ్బంధీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. టెక్నాలజీ వినియోగంపై రైతులకు అవగా హన కల్పిస్తోంది’ అని వివరించారు. ‘అత్యాధునిక సెన్సార్ల ద్వారా నేల స్వభావాన్ని రైతులు ముందే తెలుసుకోవచ్చు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా పురుగు మందుల వినియోగాన్ని తగ్గిం చొచ్చు. ఫలితంగా రసాయనాల కొనుగోలు ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతుంది. రైతులపై పడే ఆర్థిక భారం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. సుస్థిరమైన, వాతావరణం-రెసిలి యెంట్ వ్యవసాయ పద్ధతులకు మార్గం సుగమం అవుతుంది’ అని చెప్పారు. అనంతరం… రాష్ట్రంలో గత రెండేండ్లుగా వేములవాడ కు సమీపంలోని మూడు గ్రామాల్లో ‘ఫ్రాన్‌హౌఫర్ హెచ్‌హెచ్‌ఐ’ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘యాక్సిల రేటింగ్ క్లైమేట్-రెసిలియెంట్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ’ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్త రించేందుకు చొరవచూపాలని సంస్థ ప్రతినిధు లను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ చైర్మెన్ ఎం.కోదండరెడ్డి, సీడ్స్ కార్పోరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, జర్మనీ రాయబార కార్యాలయం (న్యూఢిల్లీ) ఫుడ్, అగ్రికల్చర్ డివిజన్ హెడ్ వోల్కర్ క్లైమా, ఫ్రాన్ హౌఫర్ హెచ్‌హెచ్‌ఐ ప్రతినిధులు డా.సెబాస్టియన్ బోస్సే, డా.రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణ అగ్రగామి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES