– లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్టు అనుమానాలు
– నల్లగొండ జిల్లా కేంద్రలో ఘటన
నవతెలంగాణ-నల్లగొండ
ఇంటర్ విద్యార్థిని దారుణహత్యకు గురైన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల సమీపంలో మంగళ వారం జరిగింది. కాగా నిందితుడు బాలికపై లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడన్న అనుమానాలు వస్తున్నాయని మృతురాలి బంధువులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని అన్నారెడ్డి గూడెంకు చెందిన ఇందూ(17) నల్లగొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది. గుట్టకింద అన్నారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గడ్డం కృష్ణగౌడ్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరు ఆరునెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలికను మంగళవారం కృష్ణగౌడ్ తన మిత్రుడు (ఓ ఆటోడ్రైవర్) రూమ్‌కు తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా గడ్డం కృష్ణ విద్యార్థినిని హత్య చేసి డైట్ కళాశాల సమీపంలో పడేశాడు. కాగా తల్లిదండ్రులు మాత్రం తమబిడ్డపై లైంగికదాడి చేసి హత్య చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు గడ్డం కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. ఘటనాస్థలాన్ని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, వన్ టౌన్ సీఐ వేమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES