బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మానవ సమాజానికి సత్యం, ధర్మం, న్యాయం, నైతికత మార్గాలను చూపిన మహర్షి వాల్మీకి బోధనలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి ఆయన నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు క్రాంతికిరణ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. వెనుకబడిన వాల్మీకి సామాజిక తరగతిని రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
వారికి తహసీల్దార్ కార్యాలయాల్లో కులధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా వాల్మీకి బోయల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే బీసీలకు, వెనుకబడిన సామాజిక తరగతులకు న్యాయం చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నది తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, గురుకులాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి నిర్వహణకు తగిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మహర్షి వాల్మీకి బోధనలు మార్గదర్శకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES