- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టీవీకే అధ్యక్షుడు విజయ్.. కరూర్ తొక్కిసలాట ఘటన బాధితులను కలుస్తానని తెలిపారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తమిళనాడు డీజీపీకి మెయిల్ పంపారు. మరోవైపు విజయ్ మంగళవారం బాధితులతో వాట్సాప్ కాల్‌లో మాట్లాడారు. ఓ మహిళను ఓదార్చుతూ తాను ఆమెకు కుమారుడి లాంటి వాడినని పేర్కొన్నారు. విజయ్ ఇప్పటివరకు బాధితులను నేరుగా కలవకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా డీజీపీకి పంపిన మెయిల్ ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 27న టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయాలయ్యాయి.
- Advertisement -