Sunday, May 11, 2025
Homeక్రైమ్ఔటర్‌పై ఘోర ప్రమాదం

ఔటర్‌పై ఘోర ప్రమాదం

- Advertisement -

– ఇద్దరు సజీవ దహనం.. ఆస్పత్రిలో మరొకరు మృతి
– ఆగి ఉన్న బొలెరోను ఢీకొట్టిన కారు
– మంటలు చెలరేగి దగ్ధం
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్‌

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై శనివారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఓ కారు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురిలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరొకరు ఆస్పత్రిలో మృతిచెందారు. ఈ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాంతం నుంచి బొలెరో వాహనం మామిడికాయల లోడుతో తుక్కుగూడ ఎగ్జిట్‌ నెంబర్‌ 14 ఓఆర్‌ఆర్‌పై నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ బాటసింగారం పండ్ల మార్కెట్‌కు వస్తుండగా గండి చెరువు బ్రిడ్జి సమీపంలో అదువు తప్పి డివైడర్‌ను ఢకొీట్టింది. దాంతో మామిడి కాయలు కింద పడిపోయాయి. అటుగా వచ్చిన వాహనదారులు గమనించి వాహనాలను రోడ్డు పక్కన ఆపి.. మామిడి కాయలు ఎత్తడానికి సహాయం చేస్తున్నారు. అదే సమయంలో తాడ్బన్‌ బహదురుపురకు చెందిన దీపేష్‌ అగర్వాల్‌ తన స్నేహితులు సంచరు మల్పని, ప్రియాన్స్‌ మిటల్‌తో కలిసి తెల్లవారు జామున శంషాబాద్‌ నుంచి ఘట్కేసర్‌కు టాటా కర్వు కారులో వెళ్తున్నారు. బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న బొలెరోను ఢీకొట్టారు. దాంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో దిపేష్‌ అగర్వాల్‌, సంచరు మల్పనికి అంటుకొని అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ప్రియాన్స్‌ మిటల్‌ను ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఫైరింజన్‌తో మంటలను ఆర్పేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -