నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్ షాప్స్, ఫ్లెక్సీ షాప్ ఓనర్స్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ నగర సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్సై ముజాహిద్ మాట్లాడుతూ..ఫ్లెక్సీ ప్రింటింగ్ అలాగే ప్రింటింగ్ ప్రెస్ కు సంబంధించిన ఏదైనా ముద్రించే సందర్భం లో విద్వేషపూరిత మైన మ్యాటర్, నిషేదితమైన విషయాలను ప్రచురించకుండా చూసుకోవాలి. అలాగే ఇంకా స్థానిక ఎలెక్షన్ కోడ్ ఉన్నందున పాటించవలసిన విషయాలను సూచనలను వివరించారు. ఇటువంటి సందర్భాలలో అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చును ఎవరైనా సరే చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లయితే, ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం చేస్తే చట్టపరంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రింటింగ్ ప్రెస్ బైండింగ్ షాప్ ఫ్లెక్సీ షాప్ ఓనర్స్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రింటింగ్ ప్రెస్ షాప్స్, ఫ్లెక్సీ షాప్ ఓనర్స్ తో పోలీసుల సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES