Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని బర్దిపూర్ సహకార సొసైటీ పరిధిలోని ధర్మారం బి, బర్దిపూర్ గ్రామాల్లో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సహకార అధికారి ఆదేశాల మేరకు సహకార సొసైటీ కార్యదర్శి పి.నారాయణరెడ్డిశకొనుగోలు కేంద్రాల ఇంఛార్జీలు గంగారెడ్డి, హారిష్ సమక్షంలో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నేలకోల్పిన కొనుగోలు కేంద్రంలోనే వరి  ధాన్యం విక్రయించుకోవాలని, మధ్య దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కోసరాజు రామకృష్ణ, డైరెక్టర్లు పౌలు, మెట్టు గోపాల్, జి హరినాథ్, కె అమర్నాథ్ తోపాటు రైతులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -