Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మక్కా మసీద్ చిత్రపటంపై అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి.. 

మక్కా మసీద్ చిత్రపటంపై అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి.. 

- Advertisement -

ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో డిచ్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నవతెలంగాణ – డిచ్ పల్లి 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఆరాధ్య దైవం మక్కా మసీద్ చిత్రపటంపై అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో డిచ్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం నిజామాబాద్ రూరల్ ఇంచార్జీ అబ్దుల్ వకీల్ రిజ్వీ ,ప్రతినిదులు మాట్లాడుతూ.. ముస్లిం ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించవద్దని అన్ని మతాల సారం ఒక్కటేనని అన్నారు.  సనాతని_ షేర్ _బిజెపి అనే ఐడి క్రియేట్ చేసిన వ్యక్తిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.     

ఎంతో పవిత్రంగా ముస్లింలు పూజించే మక్కా చిత్ర పటంపై అసభ్యకరమైన అశ్లీలమైన చిత్రాలు మార్ఫింగ్ చేసిన సనాతని_ షేర్ _బిజెపి పేరు మీద ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంపై ముస్లింల మనో భావాలు దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతని_ షేర్ _బిజెపి పేరు మీద ఇంస్టాగ్రామ్ ఐడిని సృష్టించిన వ్యక్తి ని వేంటనే గుర్తించి సదరు వ్యక్తిపై చట్టపరమైన కఠినమైన చర్యలు చేపట్టి ఇక ముందు ఇలాంటి పోస్టులు చేయకుండా కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, పోలిస్ ఉన్నతాధికారులకు డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే విషయమై డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆధారాలతో కూడిన ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించవద్దని, అన్ని మతాల సారం ఒక్కటేనని అందరూ అన్నదమ్ముల్లగాఉండలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నిజామాబాద్ రూరల్ ఇంచార్జ్ మహమ్మద్ అబ్దుల్ వకీల్ రిజ్వీ, లతీఫ్ ఖాన్ నిజామాబాద్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ లతీఫ్ ఖాన్, డిచ్పల్లి మండల ఎంఐఎం కమిటీ సభ్యులు గౌసోద్దీన్, రియాజుద్దీన్ , షేక్ సలీం (గ్యాస్ ),ఇర్ఫాన్, ఖాజా తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -