Wednesday, October 8, 2025
E-PAPER
Homeకరీంనగర్బైపాస్ రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడానికి అనుమతి ఇవ్వాలని వినతి

బైపాస్ రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడానికి అనుమతి ఇవ్వాలని వినతి

- Advertisement -

నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని  విలీన గ్రామాలకు చెందిన మాజీకౌన్సిలర్లు బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం అందించారు. విలీన గ్రామాలైన చిన్న బోనాల, పెద్ద బోనాల, పెద్దూర్, సర్దాపూర్ ముష్టి పెళ్లి, చంద్రంపేట, రగుడు కు చెందిన రైతులకు వడ్లు ఆరబెట్టుటకు సరైన స్థలం లేనందున, గత ఐదు సంవత్సరాలుగా సిరిసిల్ల రెండవ బైపాస్ ను వడ్లు ఆరబెట్టుకోవడానికి ఉపయోగించుకున్నారని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం బైపాస్ రోడ్డుకు ఇరువైపులా సెంట్రల్ లైటింగ్ అమరచడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని  ఈసారి కూడా బైపాస్ రోడ్డుకు వడ్లు ఆరబెట్టుకోవడానికి  అవకాశం ఇవ్వాలని వారు వినతి పత్రం అందించారు.  మాజీ కౌన్సిలర్లు బొల్గం నాగరాజు గౌడ్ లింగంపల్లి సత్యనారాయణ తో పాటు పోచవేని ఎల్లయ్య, కల్లూరి మధు, బుర్ర మల్లికార్జున్ లు పాల్గొని రగుడు నుండి వెంకటాపూర్ వరకు ఇరువైపులా ఉన్నటువంటి రోడ్డు నుండి ఒకవైపు వడ్లు పోయడానికి  అనుమతివ్వాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -