నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ మాధవరావు తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా లో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్ 19 ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల సెలక్షన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగాయి. ఇట్టి సెలక్షన్లలో నసురుల్లాబాద్ గిరిజన గురుకుల విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు మం.సత్య, యన్.కళ్యాణ్ ఎంపికయ్యారు. వీరిని పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ఇ.మాధవరావు వైస్ ప్రిన్సిపల్ రాహుల్ , పోశెట్టి మరియు వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్, అశ్విన్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు వీరు నిజామాబాద్ జిల్లా తరఫున ఈనెల 10-10-2025 నుండి 12-10-2025 వరకు కోములవాంఛ, మహబూబాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి క్రీడ పోటీల్లో ఎంపిక కావడం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరపున గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు పోటీ పనున్నారు అని అన్నారు. వీరికి పాఠశాల తరఫున శుభాభివందనాలు తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీలకు నసురుల్లాబాద్ గురుకుల విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES