కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్
నవతెలంగాణ – పెద్దవంగర
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అవుతాపురం, పోచంపల్లి, గంట్లకుంట గ్రామాల ఎంపీటీసీ క్లస్టర్ పరిధి ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం మండల ఇంచార్జిలు విజయ్ పాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా అన్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. ప్రతి గ్రామంలో బూత్ కమిటీలను బలోపేతం చేసి, స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వెల్లడించారు. భారీ మెజార్టీ ఏ లక్ష్యంగా నాయకులు అందరూ కలిసి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు ప్రవీణ్ రావు, నెహ్రూ నాయక్, మధన్ మోహన్ రెడ్డి, మురళి, తోటకూరి శ్రీనివాస్, ఓరుగంటి సతీష్, బీసు హరికృష్ణ, దాసరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, చిలుక దేవేంద్ర, ముత్తినేని లక్ష్మణ్, ముత్తినేని సోమన్న, యాకసోములు, సోమనర్సయ్య, రాంబాబు, యాకన్న, శేఖర్, ఉప్పలయ్య, తిరుపతి రెడ్డి, వేణు, ముక్తార్ పాషా, రాజు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES