– కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
– ప్రోగ్రెసివ్ పేరెంట్ లీగ్ జిల్లా అధ్యక్షులు గాజుల బాబు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మండలంలోని జిల్లేల గడ్డ లోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సనాదుల వివేక్ అనుమానస్పదస్థితిలో మృతి చెందడం అత్యంత బాధాకరమని, విద్యార్థి వివేక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని ప్రోగ్రెసివ్ పేరెంట్ లీగ్ జిల్లా అధ్యక్షులు గాజుల బాబు అన్నారు. బుధవారం వివేక్ మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. వివేక్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు.
అనంతరం పాఠశాలలో జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. వివేక మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ .. వివేక్ మృతికి గల కారణాలను తెలుసుకొని కారకులను కఠినంగా శిక్షించాలని కోరారు. విద్యార్థి వివేక్ కుటుంబంకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణసాయంగా రూ. 30 లక్షలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. గురుకుల పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయకపోవడం వల్లనే విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భాగ్యదశరథం, ఉపాధ్యక్షులు పొన్నాల నర్సింలు, సలహాదారులు సంజీవ్, స్వరూప, జిల్లా ప్రచార కార్యదర్శి వీరన్న, సభ్యులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.