ముధోల్ నియోజవర్గ బిఆర్ఎస్ సమన్వయసమితి సభ్యులు డాక్టర్ పడకంటి రమాదేవి…
నవతెలంగాణ – ముధోల్
కాంగ్రేస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారాన్ని కైవసం చేసుకుని 420హామీలను విస్మరించిందని ముధోల్ నియోజవర్గ బిఆర్ఎస్ సమన్వయసమితి సభ్యులు డాక్టర్ పడకంటి రమాదేవి ఆరోపించారు. ముధోల్ మండలం లోనితరోడ గ్రామంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్ ను విడుదల చేశారు.ఆనంతరం మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించు కోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలమైందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఈ విషయాన్ని స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి అందరికి తెలియజేసేలా కార్యకర్తలు ముందుకెళ్లాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు .ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముధోల్ నియోజకవర్గంలో అధిక శాతంలో గెలుపొంది సత్తా చాటాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గంగాధర్,నాయకులు అశోక్, ఎస్ కే బాబు, గణపతి, భూమారెడ్డి, గంగారెడ్డి, విట్టల్, సాయి ,శంకర్,ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించడం తగదు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES