Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి కేంద్రాల్లోనే పౌష్టికరమైన ఆహారం 

అంగన్వాడి కేంద్రాల్లోనే పౌష్టికరమైన ఆహారం 

- Advertisement -

పోషణ మాసం కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరి 
నవతెలంగాణ-పాలకుర్తి

అంగన్వాడి కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికరమైన ఆహారం అందుతుందని అంగన్వాడి సూపర్వైజర్ మల్లీశ్వరి తెలిపారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని గోపాలపురంలో ఈరవెన్ను సెక్టార్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంట వ్యవధిలో మురుపాలు అందించాలని సూచించారు. మురుపాలతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. శిశువులకు ఆరు నెలల వరకు తల్లిపాలు అందించాలని, ఆరు నెలల తర్వాత అతన ఆహారం అందించాలని సూచించారు. వయసుకు తగ్గ ఎత్తు బరువు ఉండాలని సూచించారు. చిన్నారులు, బాలింతలు పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈరవెన్ను సెక్టార్ అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -