అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య
నవతెలంగాణ- వనపర్తి
అక్టోబర్ 9 నుండి ప్రారంభం కానున్న స్థానిక సంస్థల నామినేషన్ ప్రక్రియను నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి నామినేషన్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. గురువారం ఉదయం నుండి వనపర్తి జిల్లాలోని 8 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
నామినేషన్ ఫారం స్వీకరణ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఫారంలో పూరించాల్సిన అంశాలు ఏమిటి, రిటర్నింగ్ అధికారి హాలులో నామినేషన్ వేసేందుకు ఎంతమందిని అనుమతించాలి, పరిశీలించాల్సిన అంశాలు ఏమిటి అనే విషయాలను మరోసారి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో ఆర్డీఓ సుబ్రమణ్యం, డిప్యూటీ కలెక్టర్లు శ్రావ్య, రంజిత్, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.