Thursday, October 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బిల్లులు పెండింగ్.. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం

బిల్లులు పెండింగ్.. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
బెస్ట్ అవైటేబుల్ స్కూల్ పథకం కింద చదువుతున్న విద్యార్థుల చెల్లింపు ఫీజు పెండింగ్ బిల్లులు గత రెండు సంవత్సరాల నుండి రావడంలేదు. ప్రభుత్వం ఫీజులు చెల్లించలేని కారణంగా 150 అడ్మిషన్లు పొందిన కృష్ణవేణి విద్యాసంస్థ యాజమాన్యం తమ సంస్థను నడపడం కష్టంగా ఉందని వాపోతున్నారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి తెలపడంతో  ఎస్సి సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. విద్యాసంస్థ విద్యార్థుల అడ్మిషన్స్ ను ఏ సమయంలోనైనా రద్దు చేస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్సి కార్యాలయం ఎదుట పిల్లలతో కలిసి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్సి సంక్షేమ శాఖ అధికారిని సునీతను కలిసి వినతిపత్రం అందజేశారు. కావున విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గత 2 సం.రాల ఫీజులు చెల్లించాలని విద్యార్థుల తల్లి, దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దింతో అటు విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైతుంది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -