Thursday, October 9, 2025
E-PAPER
Homeఖమ్మంఆకస్మికంగా పర్యటించిన ఫారెస్ట్ చీఫ్ కన్సర్వేటర్ భీమా నాయక్ 

ఆకస్మికంగా పర్యటించిన ఫారెస్ట్ చీఫ్ కన్సర్వేటర్ భీమా నాయక్ 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఫారెస్ట్ చీఫ్ కన్సర్వేటర్ బీమా నాయక్ బుధవారం ఆశ్వారావుపేట ఫారెస్టు రేంజ్ పరిధిలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ మేరకు ఆయన ముందుగా మండలంలోని ఊట్లపల్లి సమీపంలో అటవీ శాఖ ద్వారా 50 ఎకరాల్లో పెంచుతున్న ప్లాంటేషన్ సందర్శించి మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ప్లాంటేషన్ లో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు పాటించాలని,వాటిని సంరక్షించడం లో నిర్లక్ష్యం చేయవద్దని ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆశ్వారావుపేట లో నూతనంగా నిర్మిస్తున్న ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ భవనాన్ని పరిశీలించి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ కృష్ణ గౌడ్, ఎఫ్ఎస్ఓ దామోదర రెడ్డి, ఫారెస్టు రేంజర్ మురళి,ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -