Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ నోటిఫికేషన్ జారీకి సిద్ధంగా ఉన్నాం..

జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ నోటిఫికేషన్ జారీకి సిద్ధంగా ఉన్నాం..

- Advertisement -

జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్

రాష్ట్ర ఎన్నికల  కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణ నోటిఫికేషన్ జారీకి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి హనుమంత రావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ,ఎన్నికల అధికారులతో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మొదటి విడత జెడ్ పిటి సి, ఎంపిటిసి ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి  మొదటి విడత లో ఈ నెల  9 న 10 జడ్పిటిసిలు, 84 ఎంపీటీసీలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించి ఆర్వో, ఏఆర్ఓలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని , పునఃచరణ శిక్షణ కూడా ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలను నియమించడం జరిగిందని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలకు సంబంధించిన రిపోర్టులను ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతుందని, అలాగే నామినేషన్ల స్వీకరణ సందర్భంగా పూర్తి సంసిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీఓ కృష్ణా రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి  విష్టువర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -