Thursday, October 9, 2025
E-PAPER
Homeసినిమాఆ చిదంబర రహస్యం ఏమిటి?

ఆ చిదంబర రహస్యం ఏమిటి?

- Advertisement -

చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. చింతా రాజశేఖర్‌ రెడ్డి సహ నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ లాంచ్‌కు హీరో సత్యదేవ్‌, దర్శకులు వశిష్ట, వెంకటేష్‌ మహా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో సత్య దేవ్‌ మాట్లాడుతూ, ”క’ సినిమాతో చింతా గోపాల కృష్ణా రెడ్డి మంచి విజయాన్ని అందుకున్నారు. వినయ్ రత్నం మంచి కథను అద్భుతంగా చూపించారు. వంశీ తుమ్మల అద్భుతంగా నటించారు. సంధ్య ఎంతో సహజంగా కనిపిస్తున్నారు. ఈ టీజర్‌లో మ్యూజిక్‌ బాగుంది. విజువల్స్‌ అంతకంటే బాగున్నాయి. ఈ మూవీ పెద్ద హిట్‌ అవ్వాల’ అని అన్నారు.

‘ఈ కథను వినయ్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. గ్లామర్‌ కంటే గ్రామర్‌కే ఇంపార్టెన్స్‌ ఇచ్చి కొత్త ఆర్టిస్టులతో సినిమాను తీశాం. మా వరకు మేం వంద శాతం ప్రయత్నించి సినిమాను తీశాం’ అని నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి చెప్పారు. హీరో వంశీ తుమ్మల మాట్లాడుతూ, ‘యాక్టర్‌ అవ్వాలనే కల ఈ సినిమాతో నెరవేరింది. మా సినిమాకు పాజిటివ్‌ వైబ్స్‌ కనిపిస్తున్నాయి’ అని అన్నారు.
దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ, ‘వెంకటేష్‌ మహా ‘కేరాఫ్‌ కంచరపాలెం’ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడి వరకు వచ్చి ఉండేవాడిని కాదు. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా స్నేహితులకు, ఫ్యామిలీకి థ్యాంక్స్‌. ఇక మా నిర్మాతల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఎంతో సపోర్ట్‌ చేశారు. టీజర్‌ నచ్చితే అందరికీ చెప్పండి’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -