హీరో ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ ‘డ్యూడ్’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 17న దీపావళి సందర్భంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్‌లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ,’ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో చాలా రిలేటబుల్ క్యారెక్టర్ చేశాను.
మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి పని చేయడం హ్యాపీగా, ప్రౌడ్‌గా ఉంది. డైరెక్టర్ ఈ కథ చెప్తున్నప్పుడే తనలోని కాన్ఫిడెన్స్, కన్వెన్షన్ చాలా నచ్చింది. తిరుపతి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం అనేది ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, సిఇఓ: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని, సంగీతం: సాయి అభ్యంకర్, సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి, ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు, ఎడిటర్: భరత్ విక్రమన్
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- Advertisement -
- Advertisement -