- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామస్తులు గ్రామంలోని గ్రామపంచాయతీ రెండు వార్డులలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తమ గ్రామంలోని వార్డులకు కేటాయించిన రిజర్వేషన్ను మార్చాలని బ్రాహ్మ ణపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామం లోని రెండో, మూడో వార్డులను ఎస్టీలకు రిజర్వ్ చేశారన్నారు. ఎస్టీలు లేని వార్డుకు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రిజర్వేషన్ సవరించి బ్రాహ్మణపల్లి గ్రామస్తులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు.
- Advertisement -