అక్టోబర్ నుండి జనవరి వరకు దేశీయ ఎయిర్ ప్యాకేజ్ హైదరాబాద్ నుండి ప్రారంభం..
IRCTC – టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ విలేకరుల సమావేశంలో వెల్లడి..
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ స్థానిక ప్రెస్ క్లబ్ నందు IRCTC టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేష్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం అక్టోబర్ 26 నుండి నవంబర్ 04 వరకు ప్రత్యేక రైళ్లను మరియు అక్టోబర్ నుండి జనవరి వరకు దేశీయ ఎయిర్ ప్యాకేజీలను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC అసిస్టెంట్ మేనేజర్ పి వి వెంకటేష్ తెలిపారు. యాత్రలకు సంబందించిన వివరాలు వెల్లడించారు.
ప్యాకేజీ వివరాలు:
భవ్య గుజరాత్( SCZBG48):
ఈ తీర్థయాత్రలో భాగంగా దర్శించే ప్రదేశాలు ద్వారకాదీష్ మందిరము, నాగేశ్వర జ్యోతిర్లింగ మందిరము, బేట్ ద్వారక, సోమనాథ్ జ్యోతిర్లింగ మందిరము, సబర్మతి ఆశ్రమము. సూర్యదేవాలయం, రాణికి వావ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం). సామాన్యులకు అందుబాటు ధరను నిర్ణయించడం జరిగింది.
ఒక్కొక్కరికి సాధారణ టికెట్ ధర:
SL Rs. 18400/-
3AC Rs. 30200/-
2AC Rs. 39900/-
సౌకర్యాలు..
రైలు, బస్సు, హెూటల్, అన్నీ భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యహ్నం మరియు రాత్రి భోజనం, వాటర్ బాటిల్) మరియు టూర్ ఎస్కార్ట్ సేవలతో సందర్శనా స్థలాలు, ప్రయాణ బీమా అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితం. ప్రతి రైలు లో 639 మందిప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకార్యలు సమకురుస్తారు. కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్, ప్రయాణ బీమా అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు.
దేశీయ ఎయిర్ ప్యాకేజీలు..
- – అండమాన్: పోర్ట్ బ్లెయిర్ , హ్యావ్లాక్, నెయిల్ ఐలాండ్(6 రోజులు). రూ 56,625/-
- – కశ్మీర్ : శ్రీనగ్, సోన్మార్గ్, గుల్మార్గ్, పేహల్గం (ఆరు రోజులు) రూ.34950/-
- – కర్ణాటక : ఉడిపి, సింగేరి, మంగుళూరు , గోకర్ణ, ధర్మస్థల , మురుడేశ్వర్ , కొల్లూరు, కుక్కే సుబ్రమణ్యం (6 రోజులు) రూ 38550/-
- – రాజస్థాన్ : జైసల్మీర్,జోధ్ పూర్, ఉదయపూర్ (6 రోజులు) రూ.38000/-
- – ఒడిశా: భువనేశ్వర్ , కోణార్క్, పూరీ (6 రోజులు) రూ.35,000,
- – తమిళనాడు: తంజావూరు, కుంభకోణం,పాండిచేరి,కాంచీపురం(7 రోజులు) రూ 36000/-
అంతర్జాతీయ ఎయిర్ ప్యాకేజీలు..
– థాయిలాండ్:(ఐదు రోజులు) రూ.65,700,
– శ్రీలంక: (ఆరు రోజులు) రూ.64,500
– దుబాయ్: ( ఐదు రోజులు) రూ. 112250/-
సౌకర్యాలు..
విమాన టిక్కెట్లు (రెండు వైపుల)
భోజనం (ఉదయం మరియు రాత్రి
రవాణా సౌకార్యం (AC)
వసతి సౌకార్యం (3/5 స్టార్)
IRCTC టూర్ మేనేజర్
ప్రయాణ బీమా..
ఈ అవకాశాన్ని నిజామాబాద్ జిల్లా ప్రజలు ఉపయోగించు కోవాలని అన్నారు. అలాగే టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు9701360701,9281030711,9281030733,9281030749లకు సంప్రదించవలెను. మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రదించాలని IRCTC టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి వెంకటేష్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. సమావేశంలో IRCTC – టూరిజం మానిటర్ లు నరేశ్ బాబు ఓర్సు, కొక్కుల ప్రశాంత్ పాల్గొన్నారు.