Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శరీరంలోని జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి కళ్ళు

శరీరంలోని జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి కళ్ళు

- Advertisement -

నవతెలంగాణ- కంఠేశ్వర్ 
శరీరంలోని జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనవి కళ్ళుఅందుకే సర్వేద్రియానం నయనం ప్రధానం అనేది. కళ్ళు హావభావాలను సైతం విడమరచి చెబుతాయి. మన సౌందర్యానికి ప్రముఖ పాత్ర వహించేవి అధ్బుతాలని.. అందాలని చూపించగలేవి కళ్ళు మాత్రమే. ఈ కళ్ళతోనే యావత్ ప్రపంచం అందాలను చూస్తున్నాం అని పవన్ న్యూరో ఆస్పత్రి ఎం ఎస్ ఆప్తమాలజీ వైద్యురాలు మానస తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ..ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ గురువారం నాడు జరుపుకుంటారు.

కంటి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను, అంధత్వాన్ని నివారించడాన్ని తెలియజేయడానికి ఈ రోజును ఉద్దేశించారు. దృష్టి లోపాలకు నివారించగల కారణాలపై అవగాహన పెంచడం, కంటి సంరక్షణ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం దీని లక్ష్యం.  రెగ్యులర్గా కన్నులను చెకప్ చేయించుకోవాలి. మనకు వున్న వ్యాధులను కంట్రోల్ లో ఉండేలా మందులను వాడడం, మద్యం సిగరెట్ తాగడం మానేయాలి. ప్రతిరోజు ఫిజికల్ ఎక్సర్సైజులు చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -