Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన గుర్రపు మేఘన

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన గుర్రపు మేఘన

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
ఎస్జిఎఫ్ అండర్ 19 కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు గుర్రపు మేఘన ఎంపికయ్యారు. ఈ విద్యార్థిని సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామనికి చెందినది. ఆమె విద్య తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల దోమకొండలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది. ఈమె చదువుతోపాటు ఆటల్లో రాణిచ్చే విధంగా  తండ్రి గుర్రపు మహేష్ ప్రోత్సహంతో  నిత్యం సాధన చేస్తూ ఆటలో  మెలుకువ లు నేర్పినట్లు తెలిపారు.  గతంలో కబడ్డీ, ఖోఖో,  సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి నిజాంబాద్ జిల్లా జట్టు తరఫున ఆడి గత సంవత్సరం ఇంజాపూర్ రంగారెడ్డి జిల్లా అండర్ 19 బాలికల జట్టుకున్న పాల్గొని గత సంవత్సరం జిల్లాకు థర్డ్ ప్లేస్ సాధించి పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఈనెల 10 నుండి 12 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ కొమ్ములవంచ గ్రామంలో జరిగే పోటీల్లో పాల్గొంటుంది. రాష్ట్రస్థాయి ఎంపికైనందుకు  దోమకొండ గురుకుల బాలికల కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం రాష్ట్ర లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -