Thursday, October 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలునవతెలంగాణ ఎఫెక్ట్...గుంతను పూడ్చిన అధికారులు

నవతెలంగాణ ఎఫెక్ట్…గుంతను పూడ్చిన అధికారులు

- Advertisement -

పైపై పనులు వద్దు .. శాశ్వత పనులు చెయ్యండి
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులు గుంతలమయంగా మారాయి. నసురుల్లాబాద్ మండల కేంద్రం నుంచి బొప్పాస్ పల్లి బైరాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమవడంతో పెద్ద గుంతలు పడడంతో నవతెలంగాణ దిన పత్రికలో ఈ నెల 6న , పొదల మధ్య  ప్రమాదం, అనే శీర్షిక ప్రచరితం కావడంతో బాన్సువాడ డివిజన్ ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డు పక్కనే ఏర్పాటు అయిన పెద్ద గుంతను మొరం వేసి పూడ్చివేశారు. నవతెలంగాణ పత్రికలో వార్త కథనం అధికారులను మాజీ ప్రజాప్రతినిధులను కదిలించింది. భారీ వర్షం కారణంగా ఏర్పడిన గుంతను వెంటనే పూడ్చాలని మండల నాయకులు అధికారులకు సమాచారం అందించడంతో స్పందించిన అధికారులు గుంతను పరిశీలించి గుంతను పూడ్చడానికి కావలసిన మొరం రాళ్లను సమకూర్చి గుంతను పూడ్చివేశారు.

ఈ రహదారిపై నిత్యం వందలాది మంది ప్రయాణికులు సంచరిస్తుంటారు, రాత్రి పగలు అనే తేడాలేకుండా వెళ్లడంతో చాలా మంది గొంతును గమనించకుండా వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరిగాయి. నసురుల్లాబాద్ మండల కేంద్రం నుంచి బొప్పాస్ పల్లి వరకు ఉన్న రహదారికి దూరం నుంచి పంట పొలాలు చెయ్యడంతో వాహనదారులు రోడ్డు కిందికి దిగాలంటే పక్కన స్థలం లేకుండా పోయింది. రోడ్డుకు ఇరువైపులా జంగల్ కటింగ్ చేసి రోడ్డు పక్కన కనీసం ఒక్క మీటర్ మట్టి రోడ్డు ఉండేలా చూడాలని, మరమ్మత్తులతో శాశ్వత పరిష్కారం చేయాలని, ఇప్పుడు చేస్తున్నది కూడా తాత్కాలికంగా పైపై వేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్కడక్కడ గుంతలు పూడుస్తున్నారని , పూర్తిస్థాయిలో గుంతలను పూడ్చి వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -