Friday, October 10, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పులుల గణనపై అటవీ సిబ్బందికి శిక్షణ..

పులుల గణనపై అటవీ సిబ్బందికి శిక్షణ..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం అటవీ డివిజన్ కేంద్రంలో పులుల గణన సర్వేపై  అటవీ సిబ్బందికి ఎఫ్ డి ఓ   రామ్మోహన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. డివిజన్లోని సిబ్బందికి ఎఫ్ డి ఓ   తోపాటుగా ఫారెస్ట్ ఫీల్డ్ బయోలజిస్టు ఎల్లం శాఖాహార, మాంసాహార జంతువులను లెక్కించడంపై సూచనలు చేశారు. మూడు రోజులు మాంసాహార జంతువుల గణన ట్రయల్ రన్, మరో మూడు రోజులు ట్రాజెక్ట్ లైన్ లో శాఖాహార జంతువుల సర్వే చేయాలని తెలి పారు. జంతువుల అడుగులు, మలం, వెంట్రుకలు, చెట్లపై పడిన గోర్ల ఆనవాళ్లు, నేరుగా చూడడం ద్వారా వన్యప్రాణులను లెక్కించాలని సూచిం చారు. ఈ సమావేశంలో రేంజ్ అధికారులు శ్రీధర చారి, సుష్మారావు, మమత, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -