Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలలు, ఏటీసీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

పాఠశాలలు, ఏటీసీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – వర్ని 
ప్రభుత్వ పాఠశాలలు, ఐ.టీ.ఐలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు, అదే ఆవరణలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. ముఖ గుర్తింపు విధానం(ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు తీసుకున్నారా అని పరిశీలించారు. విద్యార్థులు కోసం వండిన మద్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారు.

డైనింగ్ హాల్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్, పనులను పూర్తి చేయించాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. అనంతరం బోధన్ పట్టణం, నిజామాబాద్ నగరంలలో ప్రభుత్వ ఐ.టీ.ఐ లకు అనుసంధానంగా ప్రభుత్వం నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఈ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఇంకనూ అవసరం ఉన్న మౌలిక వసతుల గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -