Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి    

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి    

- Advertisement -

పరకాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు 
నవతెలంగాణ – పరకాల 

పరకాల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి యస్ రమాదేవి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా 14-17 బాల బాలికలకు మండల స్థాయి కబడ్డీ కోఖో క్రీడల ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీడీఓ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేటి కాలమాన పరిస్థితులలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాలలో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర దేశ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు.

ఈ సందర్భంగా పెద్ద ఆంజనేయులు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం జిల్లా స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు టీ షర్టులు ఉచితంగా ఇస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ పరకాల మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సాంబయ్య నోడల్ అధికారి నామాని సాంబయ్య గెజిటెడ్ ప్రదానోపాద్యాయులు సురేందర్,మదు బాస్కర్ ,పీడీలు శ్యాం ,రజిత ,వినయ్ ,సుదీర్, రాజు , శ్రీకాంత్ ,సురేష్ మండల పరిధిలోని ప్రబుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పీఈటీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -