Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలి

స్థానిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలి

- Advertisement -

6 గ్యారెంటీలు 420 హామీల పేరుమీద కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల నుండి చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలి
తిమ్మాజిపేట మండల జడ్పిటిసి 12 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నవతెలంగాణ – తిమ్మాజిపేట

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నాయకులకు కార్యకర్తలకు నిర్దేశించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం తిమ్మాజిపేట మండలంలోని నేరళ్ళపల్లి గ్రామంలో అన్ని గ్రామాల పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తిమ్మాజిపేట మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలను, జడ్పిటిసి స్థానాన్ని కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి, ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు ప్రతి ఇంటికి చేరవేయాలని కోరారు. 6 గ్యారంటీలు, 420 హామీలను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేసే విధంగా చైతన్యం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జోగు ప్రదీప్ మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి వైస్ మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ మండల నాయకులు వేణుగోపాల్ గౌడ్, స్వామి, తారసింగ్ అన్ని గ్రామాల BRS పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -