Thursday, October 30, 2025
E-PAPER
Homeజిల్లాలువైపిఎల్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం 

వైపిఎల్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
ఎల్ఎన్ఆర్ ప్రీమియర్ లీగ్ వైపిఎల్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను  మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు గురువారం ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన  క్రికెట్ టోర్నమెంట్‌కు  మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు తేదీ 30.09.2025 మంగళవారం నాడు ఆరు టీములతో ప్రారంభించి చివరి ఫైనల్ రెండు టీములు 09.10.2025 గురువారంనాడు పోటీ పడ్డాయి. ఇట్టి ఆరు టీములకు స్పాన్సర్గా లోయపల్లి నర్సింగ్ రావు 75 వేల రూపాయలు, క్రీడాకారులకు స్పాన్సర్ గా అందజేశారు. ప్రతిరోజు క్రీడాకారులకు నిత్య అన్నదాన సౌకర్యం కల్పించారు.

క్రికెట్ టోర్నమెంట్ ప్రథమ బహుమతిగా 20 వేల రూపాయలు క్రికెట్ కప్పు, ద్వితీయ బహుమతిగా 10 వేల రూపాయలు, క్రికెట్ కప్ పెట్టారు. ఈ సందర్భంగా నర్సింగ్ రావు క్రీడాకారులతో కలిసి బ్యాట్‌బాల్ చేతపట్టి తన క్రీడా స్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. క్రికెట్ క్రీడాకారులకు జెర్సీ స్పాన్సర్లుగా చంద్రు నాయక్, సంతోష్ నాయక్ దినేష్, కములు నాయక్, డీలర్ లక్ష్మీరాజం, భాస్కర్ నాయక్, జబ్బర్ నాయకులు క్రీడాకారులకు టీ షర్ట్లు అందజేశారు.

ఎస్ ఆర్ టీం వారియర్స్ కెప్టెన్ శ్రీను, ఏ ఆర్ పి టైగర్స్ టీం కెప్టెన్ సుబ్బు, ఎన్ ఎమ్ టీ కింగ్స్ కెప్టెన్ సురేష్, బి.ఆర్.టి వారియర్స్ కెప్టెన్ తిరుపతి, రెడ్డి టీం వారియర్స్ కెప్టెన్ రెడ్డి, జెబ్బర్ జాగ్వర్ వారి స్టీమ్ కెప్టెన్ నవీన్ జట్టులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఫైనల్ గా జబ్బార్ జాగ్వర్ టీం నవీన్ జట్టు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి ఎన్ ఎం టి కింగ్స్ శ్రీను జెట్టులకు, నర్సింగ్ రావు బహుమతులు తన చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ రావు వెంట ఎల్లంపేట గ్రామ మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, వివిధ గ్రామాల పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -