సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగిన నిత్యం ప్రజల కోసo పోరాటాలు ఉద్యమాలు నిర్వహించే ప్రజల గొంతుకగా నిలుస్తున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రోజున సిపిఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం ఉప్పల ముత్యాలు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నుండి కాంగ్రెస్తో ఈ రాష్ట్రంలో అవగాహనతో ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కలిసి పనిచేయడానికి సిపిఐ సిద్ధంగా ఉoదని,సిపిఐ కి బలం ఉన్నచోట్ల జడ్పీటీసీ లుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేసే స్థానాలకు సీట్ల సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్తో పాటు సిపిఎం ఇతర వామపక్ష పార్టీలతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై జరిగిన దాడి ప్రజాస్వామ్య పునాదులపై జరిగిన దాడి అని, ఈ దాడిని భారతీయ సమాజం ముక్తకంఠంతో కండించాలని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ న్యాయవ్యవస్థకు ప్రతీక అని, ఆయనపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్య పునాదులపై దాడి చేయడమేనని, దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్ కిషోర్ను కఠినంగా శిక్షించాలని అయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చెడ చంద్రయ్య, రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, కళ్లెం కృష్ణ, ఎండి ఇమ్రాన్, చెక్క వెంకటేష్, ఏశాల అశోక్, చిగుర్ల లింగం పెరబోయిన మహేందర్ లు పాల్గొన్నారు.
సిజెఐపై దాడి.. న్యాయ వ్యవస్థను దెబ్బతీసే కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES