Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ 

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక 
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దుబ్బాకలోని ఎంపీడీవో కార్యాలయాన్ని, అక్బర్ పేట భూంపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయాలను దుబ్బాక, అక్బర్ పేట భూంపల్లి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ (ఏడీఈఏ) లు కే. నరేందర్ రెడ్డి, ఎండీ. జహూర్ లతో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ గురువారం సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ లకు పలు సూచనలు చేశారు. జిల్లాలో 15 జడ్పీటీసీ, 125 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోటీ చేయగోరు అభ్యర్థులు ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ సిబ్బంది సూచనలను పాటించాలన్నారు. వారి వెంట దుబ్బాక, అక్బర్ పేట భూంపల్లి మండలాల తహసీల్దారులు సంజీవ్ కుమార్, శ్యామ్, ఎంఈఓ లు ప్రభుదాస్, అంజయ్య, పంచాయతీ, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -