జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని
నవతెలంగాణ – వనపర్తి
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని అన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని మరికుంట ప్రాంగణంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో, అక్టోబర్ 11న నిర్వహించుకునే అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని విద్యార్థులకు బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, ఫోక్స్ చట్టం గురించి తెలియజేశారు. మహిళలకు, చిన్నపిల్లలకు, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్, వయోవృద్ధులకు, మతి స్థిమితం లేని వారికి, సామూహిక విపత్తు, మానవ అక్రమ రవాణా బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాల కోసం నాల్సా 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లోహిత, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES