- Advertisement -
- ర్యాలీని ప్రారంభించిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు
- నవతెలంగాణ – సుల్తాన్ బజార్
- కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో “లవ్ యువర్ ఐస్ వరల్డ్ సైట్ డే ర్యాలీని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ కంటి చూపు పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కంటి హెచ్ ఓ డి డాక్టర్ సవిత మాట్లాడుతూ.. ప్రతి ఏడాది అక్టోబర్ రెండో గురువారం లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు.చిన్నారులు బడిలో చేర్పించే ముందు కంటి పరీక్షలు తల్లిదండ్రులు చిన్నారులు చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కంటి సమస్యల నివారణకు కంటి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి నేత్ర పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ప్రజలకు కంటిచూపుపై అవగాహన కల్పిస్తున్నమన్నారు. దృష్టి లోపాలు 0.9 నుంచి 0.2 వరకు తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ సాధన, ఆప్తో మెట్రిస్ట్ శరత్, నర్సింగ్ సూపర్డెంట్ గ్రేడ్-2 పద్మ, మరియా, షాహిదా బేగం, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -