పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పద్మాజి వాడి చౌరస్తాలోని ఫ్లై ఓవర్ పై వీధిలైట్లు వెలగడం లేదు. అయినా స్థానిక అధికారులు చూసికూడా పట్టించుకోవడం లేదు. ఫ్లైఓవర్ ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయినా లైట్ల గురించి పట్టించుకోకపోవడం శోచనీయం, 44వ జాతీయ రహదారి అధికారులు ప్రభుత్వానికి టోల్ ప్లాజా పైన ఉన్న శ్రద్ధ.. ప్రజలకు సౌకర్యం కల్పించడం విఫలమైందని స్థానికులు విమర్శిస్తున్నారు. కొన్ని నెలల కింద ఫ్లై ఓవర్ ప్రారంభ దశలో కొద్దిరోజులు పైన లైట్లు వెలిగించారు. రెండు నెలల నుంచి ఫ్లైఓవర్ పైన లైట్లు వెలగకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చౌరస్తాలోని ప్రజలు ప్రయాణికులకు నానా ఇబ్బందులకు గురవుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ.. టోల్ ప్లాజా మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యం కల్పించడంతో 44వ జాతీయ రహదారి అధికారులు విఫలమయ్యారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫ్లై ఓవర్ పై లైట్లు, చౌరస్తాలోని సెంటర్ లైట్ ను కూడా ప్రారంభించాలని కోరుతున్నారు.
ప్లై ఓవర్ పై వెలుగని లైట్లు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES