Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 58 మందికి జైలు: ఎస్పీ

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 58 మందికి జైలు: ఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
జిల్లాలో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ ప్రధాన కారణమవుతున్నారు. కొన్నిసార్లు మద్యం సేవించి వాహనం నడిపినవారు స్వయంగా ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతుండగా, ఎన్నో కుటుంబాలు దాని వల్ల రోడ్డున పడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కామారెడ్డి జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, జిల్లా వ్యాప్తంగా నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వాహనదారులను కోర్టులో ప్రవేశపెట్టి, న్యాయమూర్తుల ఎదుట హాజరుచేయడం ద్వారా జైలు శిక్షలు లేదా జరిమానాలు విధించడం జరుగుతోంది.

గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కోర్టు మొత్తం 58 మందికి శిక్షలు విధించింది. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో  10 మందికి జైలు శిక్ష (4 మందికి 2 రోజుల జైలు, 6 మందికి 1 రోజు జైలు, 1000 జరిమానా, దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష తో పాటు1000 జరిమానా, మాచారెడ్డి, కామారెడ్డి, బిక్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్కరికి 1 రోజు జైలు 1000 జరిమానా, కామారెడ్డి: 14 మంది, రామారెడ్డి: 1 వ్యక్తి, దేవునిపల్లి: 20 మంది, బిక్నూరు: 1 వ్యక్తి, దోమకొండ: 6 మంది, రాజంపేట్: 1 వ్యక్తి, సదశివ నగర్: 1 వ్యక్తి. మొత్తం 44 మందికి 1000 చొప్పున జరిమానా విధించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా  జిల్లా ఎస్పీ మాట్లాడుతూ   మీ కుటుంబాన్ని, ఇతరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని మద్యం సేవించి వాహనం నడపవద్దు అన్నారు. మీ నిర్లక్ష్యం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు, మరికొందరు వికలాంగులై జీవితాంతం బాధపడుతున్నారు. ఇకనైనా వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపకూడదు. మీరు గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే కామారెడ్డి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం  అని  ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -