Friday, October 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమారణహోమంలో 20వేలకు పైగా చిన్నారులు బలి

మారణహోమంలో 20వేలకు పైగా చిన్నారులు బలి

- Advertisement -

12 లక్షల మంది పిల్లల ఆకలి కేకలు
వెల్లడించిన గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ

గాజా : రెండు సంవత్సరాల పాటు ఇజ్రాయిల్‌ సాగించిన మారణహోమంలో 12 లక్షల మందికి పైగా చిన్నారులు ఆకలితో అలమటించారు. 58,554 మంది పిల్లలు వికలాంగులుగా మారారు. గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ కఠోర వాస్తవాలను వెల్లడించింది. ఇజ్రాయిల్‌ సైనికుల దాడుల్లో అభం శుభం తెలియని 20,179 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 9,14,102 మంది పిల్లలు విద్యకు దూరమయ్యారని, 5,580 మంది వైద్య చికిత్స కోసం ఎదురు చూస్తున్నారని వివరించింది. గాజాలో ప్రతి 52 నిమిషాలకు ఓ చిన్నారి విగతజీవిగా మారాడని ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా చెబుతోంది. ఇజ్రాయిల్‌ దాడుల్లో చనిపోయిన పిల్లల్లో ఏడాది కూడా నిండని వారు 1,029 మంది ఉండగా 5,031 మంది ఐదేండ్ల లోపు వారు. 420 మంది పసికూనలైతే పుట్టగానే దాడుల్లో చనిపోయారు.

గాజాలో చిన్నారులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా సరిగా జరగడం లేదు. 2022లో 98.7 శాతం మందికి వాక్సినేషన్‌ జరగ్గా 2025లో అది 80 శాతానికి పడిపోయింది. ఈ నెల 7వ తేదీ నాటికి గాజాలో మొత్తం 7,67,173 మంది చనిపోగా 1,69, 780 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో 30 శాతం పిల్లలు, 16 శాతం మహిళలు, ఏడు శాతం వృద్ధులు, 47 శాతం పురుషులు ఉన్నారు. ప్రతి రోజూ కనీసం 13 కుటుంబాలు ఊచకోతకు గురయ్యాయి. మొత్తంగా 8,910 కుటుంబాలు కనుమరుగయ్యాయి. ప్రస్తుత సంవత్సరంలో 4,163 గర్భస్రా వాలు జరగ్గా 2,415 మంది నెలలు నిండకుండానే పుట్టారు. నవజాత శిశువుల్లో 274 మంది చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 408 మంది పోషకాహార లోపంతో కన్నుమూవారు. వీరిలో 34.1 శాతం మంది పిల్లలే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -