Friday, October 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిపేస్తున్నాం : ఎస్‌ఈసీ

స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిపేస్తున్నాం : ఎస్‌ఈసీ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని ప్రకటించారు. గురువారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వార్డుమెంబర్లు, సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం తెలంగాణ పంచాయతీరాజ్‌ యాక్టు-2018 ప్రకారం గత నెల 29న వెలువడిన షెడ్యూల్‌ను హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణమే నిలిపేస్తున్నామని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తదుపరి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -