నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామానికి చెందిన యువకుడు గాదె యుగంధర్ (29) అవయవదానం ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది.సాప్ట్‌వేర్ ఇంజనీరుగా ప్రయివేట్ జాబ్ చేస్తున్న యుగేందర్ ఆదివారం ఉప్పల్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఆయన్ను చికిత్సనిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించినప్పటికీ పరిస్థితి విషయమించింది. యుగేందర్ బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన విషాదసమయంలోనూ తన కొడుకు అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు గాదె మురళీధర్, శోభ ఒప్పుకున్నారు. తెలంగాణ జీవన్‌దాన్‌కు లివర్, రెండు కిడ్నీలు, రెండు కార్నియాస్ దానం చేయడంతో మరో ఐదుగురికి జీవం పోసినట్లు అయ్యింది.
అవయవదానం…ఐదుగురి జీవితాల్లో వెలుగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES