సీఎస్‌కు ఉద్యోగ జేఏసీ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలను ఏర్పాటు చేసి ఈహెచ్‌ఎస్ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావును గురువారం హైదరాబాద్‌లో ఉద్యోగ జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల మేరకు తక్షణమే ఒక డీఏను విడుధల చేయలని కోరారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనీ, మిగిలిన సమస్యలపై చర్చించి పరిష్కరించాలని సూచించారు. ఆయన సానుకులంగా స్పందించారనీ, వాటి పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నేతలు పుల్గం దామోదర్‌రెడ్డి, వంగ రవీందర్‌రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సదానందంగౌడ్, కటకం రమేష్, ముజీబ్ హుస్సేనీ, కస్తూరి వెంకటేశ్వర్లు, బి శ్యామ్, శ్రీనివాస్ రెడ్డి, దాస్య నాయక్, ప్రేమ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్నిఅమలు చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES