Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లారం ఇసుక క్వారీలో అక్రమాలు.!

మల్లారం ఇసుక క్వారీలో అక్రమాలు.!

- Advertisement -

తనిఖీలు చేసిన టిజిఎండీసి పీవో
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని మల్లారం ఇసుక క్వారీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై గురువారం టీజీఎండీసీ పీవో రాజు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సీరియల్ లేకుండా త్వరగా లోడింగ్ చేసేందుకు లారీ డ్రైవర్ల వద్ద నిర్వాహకులు లారికి రూ.2 వేల నుంచి రూ.3 వేల అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా.. క్వారీ నిర్వహకుల లారీలలో వేబిల్స్ లేకుండా జీరో దందా,రాత్రి 8 గంటల వరకు లోడింగ్ తదితర నిబంధనలకు విరుద్ధంగా క్వారీలో అక్రమాలు జరుగుతున్నట్లుగా టిజిఎండిసి అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో క్వారీని పీవో తనికి చేపట్టి పరిశీలించారు.

ఇసుక లోడింగ్, వేబ్రిడ్జ్, వే బిల్లులను తనిఖీ చేశారు. క్వారీ టార్గెట్ ఇప్పటివరకు పంపిన ఇసుక వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇసుక లోడింగ్ వచ్చే లారీల వద్ద క్వారీ నిర్వహకులు, సిబ్బంది ఎవరు డబ్బులు తీసుకోరాదని తీసుకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. వేబ్రిడ్జ్ వద్ద లారీలు ఎక్కువ సమయం ఉండకుండ చర్యలు తీసుకోవాల న్నారు. లారీలను సీరియల్ ప్రకారం లోనికి అనుమతించా లన్నారు. రాత్రి 7 లోపు బిల్లింగ్ పూర్తి చేయాలన్నారు. క్వారీ ఇసుక లోడింగ్ టార్గెట్ పూర్తి కావచ్చిందని తెలిపారు. ఆయన వెంటన టీజీఎండీసీ సిబ్బంది, క్వారీ నిర్వాహకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -